దినకరన్‌కు అండగా ఉంటా: విశాల్‌

- December 25, 2017 , by Maagulf
దినకరన్‌కు అండగా ఉంటా: విశాల్‌

టి.నగర్(చెన్నై): ఆర్‌కే నగర్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నాయకుడు దినకరన్‌కు తాను అండగా ఉంటానని నటుడు విశాల్‌ పేర్కొన్నారు. ఆ నియోజకవర్గం ప్రజల ప్రధాన సమస్యల పరిష్కారంలో తాను ఆయనకు అన్ని విధాలా సహకరిస్తాననిని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనను జారీ చేస్తూ కుక్కర్‌ చిహ్నంపై గెలిచిన దినకరన్‌ ఆ నియోజకవర్గంలోని మహిళలంతా కుక్కర్‌తో హాయిగా వంట చేసుకునే పరిస్థితులు తెప్పించేందుకు పాటుపడాలన్నారు. నియోజకవర్గంలో మురుగుకాల్వలు, నీటి సదుపాయాలు లేకుండా ప్రజలు అవస్థలు పడుతున్నారని, ఈ కీలకమైన సమస్యల పరిష్కారానికి దినకరన్‌ కృషి చేయాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com