యెమెన్‌లో సంకీర్ణ సేనల వైమానిక దాడులు, సుమారు 50 మంది మృతి
- December 26, 2017
యెమెన్‌లో హౌతీ రెబల్స్‌పై సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 48 మంది మరణించినట్లు అల్‌జజీరా టీవీ ఛానల్ తన వార్తా కథనంలో వెల్లడించింది. ఆదివారం నాడు జరిగిన 51 వైమానిక దాడుల్లో కనీసం 11 మంది చిన్నారులతో సహా మొత్తం 48 మంది పౌరులు మృతి చెందినట్లు హౌతీల ఆధ్వర్యంలోని సబా వార్తా సంస్థ వెల్లడించింది. సోమవారం నాడు సనా నగరంలో జరిగిన దాడుల్లో ముగ్గురు చిన్నారులతో సహా మరో 11 మంది మరణించారని తెలిపింది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడ్డారని వివరించింది. సనా నగరం పశ్చిమ ప్రాంతంలో నివశిస్తున్న హౌతీ స్థానిక నేత మహ్మద్ అల్ రైమీ నివాసం లక్ష్యంగా సంకీర్ణ సేనలు ఈ దాడులు చేశాయని హౌతీ దళాలకు చెందిన అబ్దుల్ మాలిక్ అల్ ఫాదిల్ అనే కార్యకర్త వివరించాడు. సౌదీ అరేబియా యుద్ధ విమానాలు హౌతీల ఆధ్వర్యంలోని ఒక ప్రభుత్వ భవనంపై కూడా దాడులు చేశాయని మరో అధికారి వివరించారు. ఈ నెలలో ఇప్పటి వరకూ సంకీర్ణ సేనలు నిర్వహించిన వైమానిక దాడుల్లో కనీసం 136 మంది పౌరులు మరణించారని ఐరాస మానవ హక్కుల కమిటీ ప్రతినిధి రూపర్ట్ కోల్విల్లీ వివరించారు. యెమెన్‌లో ప్రభుత్వ సేనలకు, హౌతీ తిరుగుబాటుదారులకు మధ్య 2014 నుండి అంతర్యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!