రజని 'ముత్తు' ఆధారంగా బాలయ్య 'జై సింహా'
- December 26, 2017
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం 'జై సింహా'. కే.ఎస్ రవికుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాని 1995లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'ముత్తు' ఆధారంగా తెరకెక్కించారట. ఈ విషయాన్ని 'ముత్తు' చిత్ర రచయిత రత్నం వెల్లడించారు. అప్పట్లో'ముత్తు' చిత్రం జపనీస్ వెర్షన్‌లోనూ విడుదలై రికార్డులు సృష్టించింది. అదేవిధంగా 'జై సింహా' చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటుందని రత్నం తెలిపారు. సినిమా సెకెండ్ హాఫ్ మొత్తం సెంటిమెంట్‌తో కూడిన సన్నివేశాలు ఉంటాయని ప్రేక్షకుడి చేత కన్నీరుపెట్టిస్తాయని పేర్కొన్నారు. ఇందులో బాలయ్యకు జోడీగా నయనతార, నటాషా దోషి, హరిప్రియలు నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అశుతోష్ రానా, బ్రహ్మానందం, మురళీ మోహన్, జయప్రకాశ్ రెడ్డి సహాయ పాత్రల్లో నటిస్తున్నారు. సీ.కే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కల్యాణ్ నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందించారు. సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల