పొంగల్‌కు భారీగా విడుదల కానున్న 'స్కెచ్'
- December 27, 2017
పక్కా మాస్ పాత్రలో సియాన్ విక్రమ్ నటిస్తున్న 'స్కెచ్' విడుదల ఖరారైంది. వచ్చే పొంగల్‌కు ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్ ప్రకటించింది. అంతేకాదు, ఇప్పుడే థియేటర్లు బుక్ చేయడం విశేషం. 'కబాలి' నిర్మాత కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయచందర్ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్నా హీరోయిన్. పరోటా సూరి, ఆర్‌కే సురేష్, అరుల్‌దాస్, మలయాళ నటుడు హరీష్, శ్రీమాన్, మధుమిత తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చగా, సుకుమార్ సినిమాటోగ్రఫి అందించారు. ప్రస్తుతం పోస్టుప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 'ఇరుమురుగన్'లో ప్రయోగాత్మక పాత్రలో మెప్పించిన విక్రమ్ 'స్కెచ్'లో ఎటువంటి ప్రయోగాలకు పోకుండా కమర్షియల్ రోల్ పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







