యూఏఈలో జనవరి 1 నుండి టాక్స్ అమలు
- December 27, 2017
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) వెళ్లాలనుకుంటే.. ఇక కాస్తా ఎక్కువ డబ్బులు చేతుల్లో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఎందుకంటే ఇక నుంచి యూఏఈలో పర్యటించే పర్యాటకులపై వ్యాట్ పడనుంది. జనవరి 1, 2018 నుంచి హోటల్స్, రెస్టారెంట్స్, పర్యాటకం, ట్యాక్సీ సేవలు, ఆభరణాలు ఇతరత్రా సేవలపై దాదాపు 5శాతం వ్యాట్‌ను వసూలు చేసేందుకు అక్కడి అధికారులు రంగం సిద్ధం చేశారు. అంతర్జాతీయంగా చూసుకుంటే దుబాయ్ వెళ్లే పర్యాటకుల్లో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారని దుబాయ్ టూరిజం డిపార్ట్‌మెంట్ అధికారులు వెల్లడించారు. దాదాపు 1.8కోట్ల మంది భారతీయులు ఏటా యూఏఈలోని దుబాయ్, అబుదాబి ప్రాంతాలను సందర్శిస్తున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు అత్యధికంగా దుబాయ్‌లోని పలు ప్రాంతాలను సందర్శిస్తుంటారు. అంతేకాదు.. అక్కడ నుంచి భారీగా ఆభరణాలను కూడా కొనుగోలు చేస్తుంటారు. కొత్త సంవత్సరం నుంచి యూఏఈ తీసుకొస్తున్న వ్యాట్ నిబంధనల ప్రకారం ఇక నుంచి భారతీయులు అక్కడ ఆభరణాలు కొనుగోలు చేస్తే..
5శాతం వ్యాట్ చెల్లించాల్సిందే. గత కొన్ని సంవత్సరాల నుంచి చమురు ధరలు తగ్గిపోవడం యూఏఈ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా పుంజుకునేందుకు ఆ దేశం వివిధ సేవలపై 5శాతం వ్యాట్‌ను వసూలు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







