మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

- December 27, 2017 , by Maagulf
మిలిటరీ హెలికాప్టర్‌ కూలి ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

మస్కట్‌: రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఒమన్‌ నేవిగేటర్‌, హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ముసానాలో హెలికాప్టర్‌ క్రాష్‌ ల్యాండ్‌ అవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్‌ బేస్‌లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్‌హెచ్‌ 90 మోడల్‌ హెలికాప్టర్‌, రెగ్యులర్‌ ట్రెయినింగ్‌ టాస్క్‌ చేపడుతుండగా క్రాష్‌ ల్యాండ్‌ జరిగిందనీ, ఈ ఘటనలో నేవిగేటర్‌ చనిపోగా, ఇద్దరు పైలట్స్‌కి చిన్నపాటి గాయాలయ్యాయని అధికారులు వివరించారు. నావిగేటర్‌ హిలాల్‌ బిన్‌ తాలిబ్‌ బిన్‌ మొహమ్మద్‌ అల్‌ హాషిమి మృతి పట్ల రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com