ఎయిర్‌పోర్ట్‌లలో రద్దీ: ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిందే

- December 27, 2017 , by Maagulf
ఎయిర్‌పోర్ట్‌లలో రద్దీ: ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవాల్సిందే

న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ విపరీతంగా ఉండబోతోంది. డిసెంబర్‌ 28 నుంచి ప్రారంభమయ్యే ఈ రద్దీ, జనవరి 1, 2, 3 తేదీల్లోనూ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెయిన్‌ ఎయిర్‌పోర్ట్‌ల చుట్టూ రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందనీ, రోడ్లపై రద్దీ నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు ఎదురుకావచ్చనీ, అలాగే ఎయిర్‌పోర్ట్‌లో కూడా చెక్‌ ఇన్‌, చెక్‌ ఔట్‌కి సమయం పట్టవచ్చునని తెలియవస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రయాణీకులు ఈ రద్దీ సమయంలో ప్రయాణించాలనుకుంటే ముందస్తుగా ఎయిర్‌పోర్ట్‌కి చేరుకునేందుకు సన్నాహాలు చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఎయిర్‌పోర్ట్‌ నుంచి అలాగే ఎయిర్‌లైన్స్‌ నుంచి వచ్చే సమాచారాన్ని ప్రయాణీకులు తెలుసుకుని, తదనుగుణంగా ప్రయాణ సమయాన్ని ముందుగా ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com