గ్లోబల్ విలేజ్ లో అగ్నిప్రమాదం..భీతిల్లిన పర్యాటకులు

- December 27, 2017 , by Maagulf
గ్లోబల్ విలేజ్ లో అగ్నిప్రమాదం..భీతిల్లిన పర్యాటకులు

గ్లోబల్ విలేజ్..దుబాయ్ లో ప్రఖ్యాత గాంచిన ఈ ఎక్సిబిషన్ ప్రతి ఏటా పర్యాటకుల్ని విశేష సంఖ్యలో ఆకర్షిస్తోంది. కానీ నిన్న జరిగిన ఘటన అందరిని ఉలిక్కిపడేట్టు చేసింది. 

మంగళవారం ఒకానొక పెవిలియన్ లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన గ్లోబల్ విలేజ్ సిబ్బంది తక్షణమే మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు కారణాలు ఇంకా తెలియనప్పటికీ ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు ధృవీకరించారు. ఈ సందర్భాంగా గ్లోబల్ విలేజ్ యాజమాన్యం మాట్లాడుతూ "మంటలను వెంటనే ఆర్పగలిగామని, యధాశక్తి పర్యాటకులకు స్వగతం పలుకుతుంది అని, న్యూ ఇయర్ వేడుకలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకున్నామని" వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com