30 ఏళ్ళ లోపు వయస్సు ప్రవాసీయులకు ఉద్యోగ నిషేధ నిర్ణయం వాయిదా
- December 27, 2017
కువైట్: ముప్పయి ఏళ్ళు లోపు వయస్సు గల ప్రవాసీయులకు తమ దేశంలో ఇకపై ఉద్యోగాలు ఉండబోవని ఇటీవల కువైట్ ప్రకటించింది. అయితే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంటూ సామాజిక వ్యహారాలు మరియు కార్మిక , ఆర్థిక వ్యవహారాల శాఖ మంత్రి హింద్ అల్-సబీ ఉపసంహరించుకొంటున్నట్లు వెల్లడించారు. తదుపరి అధ్యయనం పూర్తయ్యేవరకు తొలుత తీసుకొన్న 30 ఏళ్ళ లోపు వయస్సు ప్రవాసీయులకు ఉద్యోగ నిషేధ నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీంతో డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్, మరియు పి హెచ్డి డిగ్రీలను కలిగి ఉన్నవారిని ప్రభావితం చేస్తుంది. కార్మిక మార్కెట్లో సాధ్యఅసాధ్య విషయాలను పరిగణనలోకి తీసుకున్న తరువాత నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ పబ్లిక్ అథారిటీని ఇటీవలి సమావేశంలో అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని తిరస్కరించడం కోసం, ఆరోగ్య మంత్రిత్వశాఖ, విద్య మంత్రిత్వశాఖ, చిన్న ప్రాజెక్ట్స్ ఫండ్ ద్వారా సమర్థనలను ఆమె సమర్పించారు, అనేక సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలకు యువ మరియు నూతన గ్రాడ్యుయేట్లను కొందరిని నియమించాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







