టెక్కీ మృతదేహాన్ని తెప్పించండి: సుష్మాకు కెటిఆర్ విజ్ఞప్తి
- December 28, 2017
హైదరాబాద్: టెక్కీ కోన ఆదినారాయణ రెడ్డి మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలని తెలంగాణ ఎన్నారై వ్యవహారాల మంత్రి కెటి రామారావు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు.
తెలంగాణలోని సూర్యాపేట జిల్లాకు చెందిన ఆదినారాయణ రెడ్డి ఆస్ట్రేలియాలోని సిడ్నీలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్ఫోసిస్‌లో పనిచేయడానికి హైదరాబాద్ వచ్చిన కోన ఆదినారాయణ రెడ్డి ఆర నెలల క్రితం ఆస్ట్రేలియా వెళ్లాడు.
మృతదేహాన్ని తెప్పించడానికి సహాయం చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సిడ్నీలోని భారత కాన్సుల్ జనరల్‌కు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, ఓవర్సీస్ ఇండియన్స్‌కు లేఖలు రాసింది.
ఇటీవల ఆదినారాయణ రెడ్డి సిడ్నీలోని తన గదిలో మరణించాడు. అతని మరణానికి ఇప్పటి వరకు కచ్చితమైన కారణం తెలియలేదు. అతను మరణించిన రెండు రోజుల తర్వాత తమకు తెలిసిందని ఆయన బంధువులు అంటున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







