హాలీవుడ్ చిత్రం లో కిచ్చా!

హాలీవుడ్ చిత్రం లో కిచ్చా!

పాత్ర బాగుండేలే కానీ ఏ భాష లోనైనా..ఎలాంటి రోల్ నైనా చేయడానికైనా ఇంట్రస్ట్ చూపిస్తుంటారు కొంతమంది నటులు..అలాంటి వారిలో కన్నడ నటుడు సుదీప్ ఒకరు.కన్నడం లో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన ఈయన..తెలుగు లో ఈగ చిత్రం లో విలన్ గా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. బాహుబలి మొదటి పార్ట్ లో కాసేపు కనిపించి అలరించారు. తాజాగా ఈయన కు హాలీవుడ్ లో ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది.

ఆస్ట్రేలియన్ ఫిల్మ్ మేకర్ ఈడీ ఆర్య దర్శకత్వం లో తెరకెక్కనున్న యాక్షన్ డ్రామా లో సుదీప్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రష్యాలో జరిగే ఒక భారీ విస్ఫోటనం పేలుడుపై సినిమా కథ నడుస్తుందట. ఆ బ్లాస్ట్ వేలాది మంది జీవితాలను వికలాంగులను చేస్తుందట. సుదీప్ హై ఓల్టేజ్ పాత్రలో కనిపించనున్నాడని సమాచారం. ప్రస్తుతం సుదీప్ ఓ కన్నడ సినిమాతో చాలా బిజీగా ఉన్నాడు. ఇది పూర్తి కాగానే హాలీవుడ్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతాడని సమాచారం.

Back to Top