జాత్యహంకార వ్యాఖ్యలు: ఇద్దరు జర్నలిస్ట్‌ల అరెస్ట్‌కి రంగం సిద్ధం
- December 28, 2017
అబుదాబీ: పబ్లిక్ ప్రాసిక్యూషన్, ఇద్దరు జర్నలిస్ట్‌లను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. మీడియా సంస్థల్లో పనిచేస్తున్న ఇద్దరు జర్నలిస్టులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సోషల్ మీడియాలో వీరు చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు, చట్ట వ్యతిరేకమని న్యాయస్థానం నిర్ధారించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని క్రిమినల్ చర్యలకు వేదికగా ఉపయోగించుకోవడంపైనా న్యాయస్థానం జర్నలిస్టుల తీరుని తప్పు పట్టింది. ఈ సందర్భంగా ప్రాసిక్యూషన్, ప్రజలెవరూ సోషల్ మీడియాని తప్పుడు చర్యల కోసం వినియోగించరాదని విజ్ఞప్తి చేయడం జరిగింది. సొసైటీకి, పబ్లిక్ ఆర్డర్‌కీ చేటు కలిగించే ఎలాంటి రాతలు, బొమ్మలు, ఫొటోలు, వీడియోలు, అయినా చట్ట వ్యతిరేకమేనని ఈ సందర్భంగా అధికారులు స్పష్టం చేశారు. సోషల్ మీడియా వినియోగంపై ఎప్పటికప్పుడు అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొందరు దాన్ని దుర్వినియోగం చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం