ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు శతృవులు
- December 28, 2017
లార్జ్ డ్రీమ్స్ ను షార్ట్ కట్ లో ఫుల్ ఫుల్ చేసేదే షార్ట్ ఫిలిమ్. షార్ట్ ఫిలిమ్స్ తో ఇంప్రెస్ చేసి సిల్వర్ స్క్రీన్ పై వండర్స్ చేస్తోన్న కుర్రకారు అనేకమంది ఉన్నారు. కలలేవైనా కలలే. ఆ కలలు నెరవేర్చుకోవాలంటే అందరికీ రూట్ దొరక్కపోవచ్చు. కానీ దొరికిన రూట్ లో తమ థాట్స్ ను ఇంప్లిమెంట్ చేస్తే తర్వాత రూట్ అదే క్లియర్ కావొచ్చు. అందుకే సిల్వర్ స్క్రీన్ డ్రీమ్స్ ఉన్న నేటి యూత్ చాలామంది షార్ట్ ఫిలిమ్స్ ను లార్జ్ స్పేస్ గా వాడుకుంటున్నారు.. అయితే వీరందరికీ భిన్నంగా షార్ట్ ఫిలిమ్ నే కాస్త లార్జ్ గా చెబుతూ ‘‘ప్రేమతో ప్రేమ్’’ అనే ఓ కొత్త ప్రేమకథతో వస్తోందో టీమ్. ఇది ఒక ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. ఇప్పటి వరకూ వెండితెరపై కూడా ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు మిత్రుల కథలు చూశాం. కానీ ‘ప్రేమతో ప్రేమ్’ లో ఇద్దరు శతృవులు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. కొత్తఅమ్మాయిని చూసినప్పుడు ప్రేమ పుట్టినట్టుగానే శతృవుతోనూ స్నేహం కలగొచ్చు. అదే సినిమాలా ఉండే ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్. తమ ప్రేమతో పాటు శతృవునూ గెలవాలనుకున్న ఇద్దరు యువకుల్లో చివరికి విజేతగా నిలిచిందెవరో తెలియాలంటే మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోన్న ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.. వెండితెర సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఉన్న కంటెంట్ తో పాటు, ఆశ్చర్యపరిచే ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు.. చూస్తున్నంత సేపూ ఓ సినిమానే చూస్తున్నామా అనుకునేలా అనేక మలుపులతో సాగే ఈ షార్ట్ ఫిలిమ్.. డిజిటల్ ఆడియన్స్ కు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకంతో ఉంది ఈ టీమ్. అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ తోనే ఎంటైర్ యూత్ ను ఇంప్రెస్ చేసిందీ టీమ్.. పూర్తి ఫిల్మ్ తో మరింత బెస్ట్ ఇంప్రెస్ వేస్తామనే కాన్ఫిడెన్స్ తో ఉంది.. కంప్లీట్ యూత్ ఫుల్ షార్ట్ ఫిల్మ్ గా రాబోతోన్న ఈ ప్రేమతో ప్రేమ్ లో, మహేష్ ఎన్నింటి, స్నహా సింగ్, అనికా అబ్బాస్ ప్రధాన పాత్రధారులు..
ఎడిటర్స్ : విశ్వనాథ్, పవన్,
మాటలు, స్క్రీన్ ప్లే : భరద్వాజ్,
కథ : మహేష్ యొన్నింటి, సంగీతం : ఎల్విన్ జాషువా,
సినిమాటోగ్రఫీ : సందీప్ బద్దులు,
కో ప్రొడ్యూసర్స్ : పరేష్ గాదె, బోస్క తబిత,
రాజశేఖర్, నిర్మాత : జే.సి. క్రియేషన్స్,
దర్శకత్వం : నాగరాజు సింగిరిశెట్టి.. సాంకేతిక నిపుణులు...
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల