ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు
- December 28, 2017
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధ్యక్షుని హోదాలో రాహుల్ గాంధీ తొలిసారి ఈ వేడుకలకు సారధ్యం వహించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
రాజకీయ ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీ అబద్దాలడుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. కేంద్రమంత్రి అనంతకుమార్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ ఖండించారు. బీజేపి సీనియర్ నేతలు తమ ప్రకటనల ద్వారా రాజ్యాంగంపై ప్రత్యక్ష దాడికి దిగారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా వర్ణించారు. ప్రతీ భారతీయుడు రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేయాలన్నారు రాహుల్.
అటు హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ నేతలంతా హాజరు కాగా.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్ర కల సాకారమైందన్న ఉత్తమ్.. ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని విమర్శించారు. దళిత గిరిజన వెనుకబడిన వర్గాలపై దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినప్పటికీ.. సీఎం అఖిలపక్షాన్ని ఢిల్లీ ఎందుకు తీసుకుపోవడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సును నిర్వహించలేమని కేసీఆర్ సర్కార్ చేతులెత్తేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.
రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత.. మంచి జోరు మీదున్న కాంగ్రెస్ కేడర్‌కు.. పార్టీ ఆవిర్భావ వేడుకలు మరింత జోష్ నిచ్చాయి.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







