జనవరి 1న పుట్టే ఆడపిల్లకు రూ.5లక్షలు
- December 28, 2017
కొత్త సంవత్సరం రోజున జన్మించే మొదటి ఆడపిల్లకు బెంగళూరు పాలికె బంపర్ ఆఫర్ అందించనుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని పాలికె ఆసుపత్రుల్లో జన్మించే మొట్టమొదటి ఆడపిల్లపై కనకవర్షం కురియనుంది. 31వ తేదీన అర్ధరాత్రి 12 గంటలు, ఆ తరువాత కళ్లుతెరిచే ఆడకూతురికి రూ.5 లక్షల నగదు బహుమతి అందజేస్తామని మేయర్ సంపత్‌రాజ్ గురువారం ప్రకటించారు. ఆ చిన్నారి పేరుతో బీబీఎంపీ కమిషనర్ ఉమ్మడి ఖాతా తెరిచి ఆ నగదును డిపాజిట్ చేస్తామని తెలిపారు.
ఆడపిల్లకు 18 ఏళ్లు నిండిన తరువాత ఆమె విద్యాభ్యాసం కోసం ఈ నగదును వినియోగించవచ్చునని మేయర్ చెప్పారు. సిజేరియన్ కాకుండా, సాధారణ ప్రసవం ద్వారా జన్మించిన ఆడపిల్లకు మాత్రమే ఈ అదృష్టం వరించనుంది. నేటి పరిస్థితుల్లో ఆడపిల్ల అంటే నిర్లక్ష్యం చేస్తున్నారని కానీ ఆడపిల్లలు అందరితో సరిసమానంగా నిలబడి పనిచేస్తారని అన్నారు. అలాంటి ఆడపిల్లలు ఎంతో ముఖ్యమని భావించి వారిని ప్రోత్సహించడానికి నజరానా ప్రకటించామని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







