విదేశాల్లో కచ్చితంగా '‘కొలువు’
- November 19, 2015
విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి.. ఓ నర్సు వద్ద నుంచి ఓ వ్యక్తి రూ.8లక్షలు కాజేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. థానే నగరానికి చెందిన ఓ యువతి స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె ఫోన్‌కి గత ఏడాది ఓ కంపెనీ నుంచి ఉద్యోగ అవకాశం అంటూ మెసేజ్ వచ్చింది. అందులో ఉన్న ఫోన్ నెంబర్‌కి యువతి ఫోన్ చేయగా.. రూ.8లక్షలు కడితే డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పాస్తానంటూ రజినీకాంత్ దోషి అలియాస్ ధర్మేష్ దోషి అనే వ్యక్తి ఆ యువతికి చెప్పాడు.అతని మాటలను నమ్మిన ఆ యువతి ముందుగా అతనికి రూ.4లక్షలు కట్టింది. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి ఆ వ్యక్తిని నిలదీయగా.. మరో రూ.4లక్షలు కడితే కచ్చితంగా ఉద్యోగం అంటూ నమ్మించాడు. అయినా ఉద్యోగం రాకపోవడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ వ్యక్తిపై గతంలోనూ ఇలాంటి కేసులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







