'డిక్టేటర్' సంక్రాంతి కానుక..
- November 19, 2015
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'డిక్టేటర్'. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష నాయికలు. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని సమకూర్చారు. డిసెంబర్ 20న అమరావతిలో ఈ సినిమాలోని పాటలను విడుదల చేయనున్నారు. శ్రీవాస్ మాట్లాడుతూ ''డిక్టేటర్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలాంటి కథతో తెరకెక్కిస్తున్నాం. బాలకృష్ణగారు స్టైలిష్ యాంగిల్లో కనిపిస్తారు. యాక్షన్, ఎమోషన్, డ్రామా... ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న సరికొత్త సబ్జెక్ట్ ఇది. ఈరోస్ సంస్థతో మా వేదాశ్వ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 20న అభిమానుల సమక్షంలో అమరావతిలో అంగరంగ వైభవంగా ఆడియో వేడుకను నిర్వహిస్తాం. బాలకృష్ణగారు అందిస్తున్న సహకారంతో సినిమా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న సమయంలోనే పూర్తవుతుంది. సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







