చికెన్‌ ఫింగర్స్‌

- December 29, 2017 , by Maagulf
చికెన్‌ ఫింగర్స్‌

కావలసిన పదార్థాలు : చికెన్‌ - అరకేజీ, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టీస్పూన్‌, పుదీనా ఆకులు - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కారం, గరంమసాలా - ఒక్కోటి అరస్పూన్‌ చొప్పున, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక టేబుల్‌ స్పూన్‌, కోడిగుడ్డు - ఒకటి, బ్రెడ్‌ పొడి - కొద్దిగా.

తయారుచేయు విధానం : చికెన్‌ను శుభ్రంగా కడిగి అందులో పుదీనా ఆకులు, అల్లం వెలుల్లి పేస్టు, ఉప్పు, ఉల్లిపాయలు, కారం, నిమ్మరసం వేయాలి. కొంచెం నూనె, కోడిగుడ్డు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బ్రెడ్‌ పొడి కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ పాన్‌లో పావుగంట బేక్‌ చేయాలి. కరకరలాడుతున్న చికెన్‌ ఫింగర్స్‌ను వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com