వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్..!
- December 29, 2017
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఓ అదిరిపోయే ఫీచర్‌ను అతి త్వరలో అందుబాటులోకి తేనుంది. గ్రూప్‌లలో ఉన్న యూజర్లు వ్యక్తిగతంగా చాటింగ్ చేసుకునేందుకు ఉపయోగపడే 'ప్రైవేట్ రిప్లై' ఫీచర్ ఇప్పటికే వాట్సాప్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉండగా ఇకపై ఈ ఫీచర్ యూజర్లందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు వాట్సాప్‌లో ఏదైనా గ్రూప్‌లో ఉన్న మరో యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. అందుకు గ్రూప్‌ను వదిలి వెనక్కి రావల్సిన పనిలేదు. గ్రూప్‌లో ఉండగానే యూజర్ పెట్టే మెసేజ్‌లపై హోల్డ్ చేసి పట్టుకుంటే వచ్చే మెనూలో ఉండే 'రిప్లై ఇన్ ప్రైవేట్' అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, గ్రూప్‌తో సంబంధం లేకుండా ఆ యూజర్‌తో ప్రైవేట్‌గా చాటింగ్ చేయవచ్చు. కాగా ఈ ఫీచర్ విండోస్ ఫోన్ 2.17.348 బీటా వెర్షన్‌లో తాజాగా దర్శనమిచ్చిందని పలువురు యూజర్లు తెలియజేస్తున్నారు.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం