భారతీయ తొలి స్పేస్ ఫిల్మ్ టిక్..టిక్..టిక్..!
- December 30, 2017
విశ్వ రహస్యాల గురించి ఛేదించడం..యుద్దం చేయడం..లాంటి స్పేస్ ఫిల్మ్ ఎక్కువగా హాలీవుడ్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత దేశంలో భారీ బడ్జెట్ తో మొదటి సారిగా స్పేస్ ఫిల్మ్ తెరకెక్కుతుంది. జయం' రవి, నివేదా పేతురాజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తమిళ చిత్రం 'టిక్: టిక్: టిక్'. ఈ చిత్రం సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్గా.. స్పేస్ సబ్జెక్ట్తో తెరకెక్కుతోంది. ఇంతవరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎవ్వరూ చూపించని విధంగా ఒక పెద్ద అద్భుతమే చూపించబోతున్నాడు దర్శకుడు.
మన దేశపు ఫస్ట్ స్పేస్ ఫిల్మ్ గా రాబోతోన్న ఆ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తోనే దర్శకుడు భారీ అంచనాలను రేపాడు అనిపిస్తోంది. శక్తి సౌందర్ రాజన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు. 'బిచ్చగాడు' సినిమా తర్వాత శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్ బేనరుపై ఆయన అందిస్తున్న సినిమా ఇదే.
సినిమాలో 80 నిముషాల సేపు ఉండే వీజువల్ ఎఫెక్ట్స్ చాలా అద్బుతంగా ఉంటాయట. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. మలేషియా నటుడు ఆరాన్ అజీజ్ విలన్గా నటించారు. చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి జనవరి మూడో వారంలో విడుదల చేస్తాం. ' అని తెలిపారు శ్రీనివాసరావు.
తాజా వార్తలు
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ







