ఇకపై పాస్‌పోర్టు పొందడం చాలా సులభం..!

- December 30, 2017 , by Maagulf
ఇకపై పాస్‌పోర్టు పొందడం చాలా సులభం..!

పాస్‌పోర్టు పొందడానికి ఇప్పటికే నిబంధనలను సరళతరం చేసిన కేంద్ర ప్రభుత్వం మరింత సరళం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాస్‌పోర్టు పొందాలంటే జనన ధ్రువీకరణపత్రం లేదా ఎస్‌ఎస్‌సీ మార్కుల జాబితాగాని పొందుపర్చాల్సి ఉండేది. ఇకపై ఎస్‌ఎస్‌సి మార్కుల జాబితాను పొందుపర్చాల్సిన అవసరం లేదు. పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన ధ్రువ పత్రాల విషయంలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇటీవల పలు సడలింపులను చేసింది. ఇప్పటి వరకు జనన ధ్రువీకరణకు ఎస్‌ఎస్‌సీ సర్టిఫికెట్‌ లేదా పంచాయతీ లేదా మున్సిపాలటీ ఇచ్చే ధ్రువీకరణ పత్రాలు మాత్రమే చెల్లుబాటు అయ్యేవి. ఇకపై ఆ అవసరం లేదు. ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఉన్న పుట్టిన తేదీలను పరిగణనలోకి తీసుకుంటారు. భార్యభర్తలు విడాకుల కోసం దరఖాస్తు చేసుకుని పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా భాగస్వామి పేరు నమోదు చేయాల్సి వచ్చేది. ఆ నిబంధనను కూడా సడలించారు.
 
తాజా మార్గదర్శకాలు ఇలా..
పాస్‌పొర్టుకు జనన ధ్రువీకరణపత్రం అవసరం లేదు. ఎస్‌ఎస్‌సీ మార్కులు జాబితా అవసరం లేదు. ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డులలో నమోదు చేసిన పుట్టిన తేదీ సరిపోతుంది. ప్రభుత్వ ఉద్యొగులు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే ఎన్‌వోసీ సమర్పించాల్సి ఉండేది. ఇకపై ఆ అవసరం కూడా లేదు. సర్వీసు రిజిష్టర్‌ చూపిస్తే సరిపొతుంది. పెన్షనర్‌లు తాము పొందుతున్న పెన్షన్‌ వివరాలు ఇస్తే సరిపోతుంది. టీసీ(ట్రాన్సఫర్‌ సర్టిఫికెట్‌), పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటరు గుర్తింపు కార్డుల్లో ఏవైనా రెండు గుర్తింపు కార్డులను దరఖాస్తుతో పొందుపర్చుకోవచ్చును. అనాథ పిల్లలు దరఖాస్తుకు తాము ఉండే అనాథ శరణాలయం నుంచి లేఖ ఇస్తే సరిపోతుంది. లేదా శిశు సంరక్షణ సంస్థ తమ లెటర్‌ హెడ్‌పై వివరాలు రాసిచ్చినా అనుమతిస్తారు. వివాహాం అయిన మహిళలు దరఖాస్తులు చేసుకోవాలంటే వివాహా ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. భాగస్వామి పేరు రాస్తే సరిపోతుంది. విడాకులు తీసుకున్న వారు కోర్టు ధ్రువీకరించిన పత్రాలను పొందుపర్చాలసిన అవసరం లేదు. తల్లి బిడ్డలు సమ్మతిస్తే భర్త పేరు రాయాల్సిన అవసరం లేదు. సాధువులు, సన్యాసులు తమ గురువు పేరు రాసి దరఖాస్తులు చేసుకోవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com