మదిని మీటిన వర్షం-పార్ట్-4

- November 19, 2015 , by Maagulf

మనసంతా గందర గోళంగా ఉంది తను చెప్పిన ఆ మాటలు చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి, ఆ కళ్ళ నీళ్ళు మాత్రం మనసు కలిచివేస్తున్నాయి ఏమి ప్రాబ్లం ఉండొచ్చు అని ఆలోచిస్తూ నడుస్తున్న .. పక్కన అనిల్ గాడు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమి ఉన్న ఫస్ట్ వాడితో షేర్ చేసుకుంటా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నేను బదులు చెప్పక పోయేసరికి రేయ్ అని అదిలించాడు ఏమయిందిరా ఎందుకు మూడిగా ఉన్నావు ?? జరిగింది చెప్పాను… “రేయ్ ప్రతి ఒక్కరికి ప్రొబ్లెమ్స్ ఉంటాయి అన్నిటిని మనం పట్టించుకోలేము పరిష్కరించలేము నీ వాళ్ళ తను సంతోషంగా ఉన్న అనింది కదా వదిలేయ్ తన ప్రొబ్లెమ్స్ గురించి ఆలోచిస్తూ నీ తల చేడగోట్టుకోవద్దు" అన్నాడు… “అది కాదు మామ ప్రతి పెళ్లిల్లో ఇలాగే ఫన్నీగా ఉంటాను కొన్ని కళ్ళు ఎదవ లాగ చూసాయి, కొన్ని కళ్ళు పిల్లోడి చేష్టలు అని కోపంగా చూసేవి, కొన్ని కళ్ళు మంచి మాటకారి అని గొప్పగా చూసేవి, కొన్ని కళ్ళు తమని సంతోష పెట్టినందుకు అభిమానంతో చూసాయి, చాల కళ్ళు ఇలాగే నవ్వుతు నవ్విస్తూ ఉండు అని దీవించాయి కాని ఈ వర్ష కళ్ళు మొదటిసారి కన్నీళ్ళతో కృతజ్ఞత చెప్పింది ఆ కన్నీళ్లు ఏంటి ఆ బాధ ఏంటి అసలు తను ఎవరు ?? “ అని బాహుబలి లెవెల్లో డైలాగ్ చెప్పి ప్రభాస్ స్టైల్లో నిలపడ్డాను… “నువ్వు పెద్ద భరతేంద్ర బహుబలివి మరి, అయిన ఆ అమ్మాయిని చూసాక నువ్వు ఏంట్రా ఏమేమో మాట్లాడుతున్నావు అందరు ఏడిపిస్తున్న కౌంటర్లు వేస్తున్న సైలెంట్ గా ఉంటున్నావు, అమ్మాయినే చూస్తుంటావు, కొంప తీసి లవ్ చేస్తున్నవ ఏంటి జాగ్రత్తరోయి ?? “ అన్నాడు … “లేదులే మామ అందమైన అమ్మాయి కన్నీళ్ళుతో థాంక్స్ చెప్పింది చాల హ్యాపీగా ఉన్నాను స్పెషల్ గా అఫెక్షన్ చూపించింది ఆ కన్నీళ్ళు దేనికి వచ్చాయి దేనికి బాధ పడుతోంది అని తెలుసుకోవాలని అంతే” అని చెప్పా.. “అవునా అయితే తరువాత మండపంలోకి వెళ్ళినప్పుడు తనని అడిగి తెలుసుకుందాం సరేనా అది విన్న నాకు షాక్…. “తెలుసుకుందామా నేనేదో వర్షను ఇంప్రెస్స్ చేసి నన్ను చూసే లాగ చేసుకున్న ఎలాగైనా దగ్గర అవ్వాలని ప్లాన్స్ వేస్తుంటే మధ్యలో పానకంలో పుడక లాగ వీడు ఎలాగైనా కట్ చేయాలి …. అలాగే ముందుకు వెళ్తున్న వాడు వెనక తరిగి ఏమయింది రా అన్నాడు కొంచం టర్న్ ఇచ్చుకో … “అరేయ్ మామ వర్ష ఈ సెకండ్ నుంచి నీకు చెల్లెలూ తన బాధలు సంతోషాలు ఈ బావ చూసుకుంటాడు … నేను మీ చెల్లి అంతే మధ్యలో ఎవరు ఉండకూడదు ఓకే … అన్నగా నీ పని చెల్లెలు ఎక్కడ ఉందో తెలుసుకొని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వూ అంతే …. కావాలంటే పక్కన ఆ బండది ఉంది కదా అదే మన లారక్క దాన్ని నువ్వు చూసుకో చాల గెలుకుతోంది అడ్డం పడుతోంది దాన్ని కంట్రోల్ పెట్టు” అని చెప్పాను “ఆ బండది నాకు ఎందుకు రా బాబు అయిన ఇంత కుళ్ళు ఏంట్రా నీకు ఇంకా అమ్మాయి ని సరిగ్గా చూడకముందే తనకు అన్నయను చేసావు” … “నీకేంటి బావ అందగాడివి బుద్ధిమంతుడివి ఎవరినా పడతారు ఏదో నా బాధలు నావి… ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా చేష్టలు చూసి సంతోష పడిపోయి ఇంప్రెస్స్ అయిపోయి రెండు కన్నీటి బొట్లు కార్చింది అంటే అబ్బా ఆ ఫీలింగ్ వేరులే నీకు ఎదురైతే తెలుస్తుంది లే “….. “చూద్దాంలే పద ఫస్ట్ అభి గాన్ని రెడీ చేయాలి…. “
పెళ్లి కొడుకు రెడీ చేస్తున్నాం అనడం కంటే వాడిని వస్త్రాపహరణం చేసి ఏమి లేకుండా నిలపెట్టి వాడి ఫొటోస్ వీడియోస్ తీసి, వాడితో సేల్ఫీస్ దిగి, వాడి మొబైల్ లాక్కొని ఆ ఫొటోస్, వీడియోస్ పెళ్లి కూతురికి పంపిస్తాం అని బయపెట్టి మందుపార్టీ కి డబ్బు వసూల్ చేస్తాం ….. అలా అభిగాడి దగ్గర పదివేలు లాక్కొని వాడికి పంచ కట్టించి పెళ్లి కొడుకు లాగ ముస్తాబు చేసి తల పాగా పెట్టి.. వాడి ఫోటోలు తీసి నందుకి పంపాము తన ఫోటోలు అడిగి అభి గాడికి చూపించాము “రేయ్ ఆడపిల్లరా సిగ్గు పడాల్సింది అయిన ఫోటో చూసి ఇంత సిగ్గు పడితే ఇంకా శోభనము రోజు ఎదురగా చూస్తే ఏమి చేస్తావు రా ఎదవ… అబ్బ శోభనం పేరు చెప్పగానే అష్ట వంకరలు తిరిగుతున్నాడు ఆపురా నువ్వు సిగ్గుపడటం “ ఇంతలో ఫ్రెండ్స్ అందరం మంచి డ్రెస్ వేసుకొని తోడు పెళ్లి కొడుకుల్లగా రెడీ అయ్యాము ….. అనిల్ గాడికి దమ్ము కొట్టాలనిపించి పైకి తీసుకెళ్ళాడు, వెళ్తుంటే వెనక గజ్జెల సౌండ్ వినిపించింది తిరిగితే వీడు తిడతాడు భ్రమ అయిఉండొచ్చు అని వెళ్ళిపోయాము… ఏదో మాట్లాడుతూ షూకి లెస్ వేసుకుంట అని సిగరాటే చేతికి ఇచ్చాడు (నేను దమ్ము కొట్టాను అసలు అలవాటు లేదు) పట్టుకున్న “రేయ్ ఇంకెప్పుడు ఎదుగుతావు రా దమ్ము ఎప్పుడు కోడతావు ?? కనీసం నోట్లో అయిన పెట్టుకోరా ఒక ఫోటో తీసుకుంటా ఆ తృప్తి అయిన మిగుల్చు” అని అడిగాడు … నేను రజని స్టైల్లో సిగరాటే పెదవుల దగ్గర పట్టుకొని నిలపడి పోజ్ ఇస్తున్న ఇంతలో నా వర్ష డార్లింగ్ అందంగా ఎంట్రీ ఇచ్చింది సిగరాటే తో నన్ను చూసి కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూసింది అంతే … ఆ బిత్తరపాటులో ఒక దమ్ము జోరుగా లాగేసా ఆ పొగకి దగ్గుతూ నానా కష్టాలు పడుతుంటే తను వెళ్లిపోయింది .. వీడు ఏమయింది రా అని అడిగాడు “ నీ యబ్బ నీ సిగరాటే గోల వల్ల జీవితం సంకనాకిపోతోంది కదారా అని వాడి ముడ్డి మీద ఒకటి ఇచ్చి “ కిందకి పరిగెత్త మెట్లు దిగుతున్నప్పుడు కనపడింది వర్ష అని పిలిచా స్టెప్స్ పక్కన రూం నుంచి ఒక జంబల హాట్ ఆంటీ బయటకు వచ్చి వర్ష నా ఏంటి బాబు ఎవరు అనింది దాన్ని కవర్ చేసేకి మల్లి “ఈ వర్షం సాక్షిగా నువ్వు నాకే సొంతం“ అని పాట పాడను …. ఆంటీ సిగ్గు పడుతూ నాకు ఓకే బాబు మా ఆయన్ని ఎలా ఒప్పించాలి అనింది… ఓరి దీని వేసాలో చాల ఆశలు ఉన్నాయే అనుకోని వర్ష వేల్లిపోతోందే ఎలా “ మీ ఆయన ఉనప్పుడు చెప్పండి ఆంటీ నేను వచ్చి ఒప్పిస్తా “ అని తప్పించుకున్న ఆంటీ ముసి ముసి నవ్వులు నవ్వుతు నిలపడింది … మేడం కనపడటం లేదు ఏ రూంలో దూరిందా అని ప్రతి రూం డోర్ దగ్గరికి వెళ్లి చెవులు రిక్కించి వింటున్న అలా ఒక రూం దగ్గర అందమైన అమ్మాయిల నవ్వులు మాటలు, గాజుల శబ్దాలు, సెంటు బుడ్డి వాసనలు వచ్చాయి తప్పకుండా ఇదే రూం ఇప్పుడు డోర్ కొట్టి వర్షని ఎలా పిలవడం … మా రూం డోర్ కొట్టినట్టు రేయ్ మామ తలుపు తీయిరా అని అరిచా నా వాయిస్ విని వర్ష బయటకు వస్తుంది అని వెయిట్ చేస్తున్న ….. తలుపు అవతల బండది “ఎవడే పెళ్లి కూతురు రూం తలుపు కొడుతున్నాడు… “ భరత్ అని చెప్పింది వర్ష “అబ్బ అంత కరెక్ట్ గా ఎలా చెప్పావే ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ వాడి మీద” అని గద్దించింది “పొద్దున్న నుంచి తను గడ్డి మోపు కుడితి తెమ్మని అరిచింది ఇదే గొంతుతో“ అని సెటైర్ వేసింది అబ్బ చా జాగ్రత్త స్టొరీ సైడ్ ట్రాక్ కి వెళ్తోంది చంపేస్త అని వార్నింగ్ ఇచ్చి “ వీడి సంగతి నేను చుసుకుంట” అని డోర్ తెరిచింది ….

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com