నేడు ప్రమాణస్వీకారం చేయనున్న బీహార్ ముఖ్యమంత్రి
- November 19, 2015
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బిహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో అందుకు తగిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2.00 గంటలకు నితీశ్ ఐదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహు ల్ గాంధీతోపాటు లోక్ సభ, రాజ్యసభలోని ఆ పార్టీ నేతలుకు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని ఇప్పటికే నితీశ్ ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే ఇంతకుముందే ఈ రోజు నిర్ణయించిన కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు హాజరవుతారని నితీశ్ కు మోదీ చెప్పినట్లు సమాచారం. వెంకయ్యతోపాటు మరో కేంద్ర మంత్రి, బిహార్ కు చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ కూడా నితీష్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకానున్నారని తెలిసింది. 243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీకి ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీ(యూ), కాంగ్రెస్ పార్టీల మహాకూటమి 178 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న విషయం విదితమే. డిప్యూటీ సీఎం పదవి తమ కుమారుడు లేదా కుమార్తెకు ఇవ్వాలని ఇప్పటికే లాలూ...నితీశ్ ను కోరినట్లు తెలిసింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నితీశ్ కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







