హలీమ్‌ కబాబ్‌

- December 30, 2017 , by Maagulf
హలీమ్‌ కబాబ్‌

కావలసిన పదార్థాలు:
 
గోధుమ రవ్వ - అర కప్పు
మినప్పప్పు - అర కప్పు
కందిపప్పు - అర కప్పు
పెసర పప్పు - అర కప్పు
మటన్‌ చాప్స్‌ - కిలో
తరిగిన వెల్లుల్లి - 10
అల్లం తరుగు - 2 టీస్పూన్లు
నెయ్యి - 2 టే.స్పూన్లు
ధనియాల పొడి - 1 టే.స్పూను
జీలకర్ర పొడి - 1 టే.స్పూను
చాట్‌ మసాలా - 1 టే.స్పూను
కారం - 1 టే.స్పూను
కుంకుమ పువ్వు - పావు టీస్పూను
పసుపు - 1 టే.స్పూను
కొత్తిమీర తరుగు - 1 కప్పు
పుదీనా తరుగు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
శనగపప్పు - 1 కప్పు
 
తయారీ విధానం:
 
శనగపప్పు తప్ప అన్ని పప్పులు శుభ్రంగా కడిగి రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి.
ఉదయం మళ్లీ కడిగి వెడల్పాటి గిన్నెలో వేసుకుని దాన్లో మటన్‌ చాప్స్‌, వెల్లుల్లి, అల్లం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించాలి.
నీరు తెర్లాక మంట తగ్గించి మటన్‌ మెత్తగా తయారయ్యేవరకూ ఉడికించాలి.
తర్వాత గరిటెతో మటన్‌ చాప్స్‌ వేరే ప్లేట్‌లోకి తీసి చల్లారాక ఎముకలు తీసేయాలి.
శనగపప్పుని నూనె లేకుండా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.
ఈ మాంసాన్ని మెత్తగా మెదిపి శనగపప్పుతో కలిపి పక్కనుంచాలి.
బాండీలో నూనె పోసి గరం మసాలా దినుసులు, కుంకుమ పువ్వు వేసి సువాసన వచ్చేదాకా వేయించాలి.
తర్వాత దీనికి ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పుల మిశ్రమాన్ని, మటన్‌ను చేర్చి చిన్న మంట మీద కలుపుతూ ఉడికించాలి.
10 నిమిషాలకు మిశ్రమం చిక్కబడిన తర్వాత మెత్తని పేస్ట్‌లా మెదిపి చేతికి నూనె రాసుకుని 50 గ్రాముల ఉండలుగా చుట్టాలి.
ఈ ఉండలను చదునుగా చేసి పెనం మీద రెండు వైపులా కాల్చుకుని వేడిగా సర్వ్‌ చేయాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com