దుబాయ్ లో అష్టకష్టాలు పడ్తున్న తెలంగాణ వాసి
- December 30, 2017
దుబాయ్‌లో ఉద్యోగానికి వెళ్లి తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై ఉండాల్సిన పరిస్థితి. అప్పుచేసి బతుకుదెరువుకోసం పొరుగుదేశం వెళ్లి పాట్లుపడుతున్న కరీంనగర్ అభాగ్యుడు.
కష్టాలను వెళ్లబోసుకుంటూ అభాగ్యుడి పేరు మధు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ గ్రామవాసి. బతుకుదెరుకోసం లక్షాపదివేలు అప్పు తీసుకొని ఏజెంట్ ద్వారా దుబాయ్ వెళ్లాడు. అక్కడ స్టార్ సర్ఫింగ్ కంపెనీలో పనికి చేరారు. కానీ వెళ్లిన రెండు నెలలకే మధుకి తత్వం బోధపడింది. తను మోసపోయినట్లు గ్రహించాడు.
ఒప్పందం ప్రకారం జీతం ఇవ్వకుండా కంపెనీ మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో బాధితుడు గోడు వెళ్లబోసుకున్నాడు. అంతేకాదు కంపెనీ తరపున ఇన్సూరెన్స్ కూడా లేదని వాపోయాడు. మధు నానాపాట్లు పడుతున్నట్లు తెలిపారు. తనలాగే చాలా మంది అక్కడ కష్టాలు పడుతున్నట్లు చెప్పారు. ఫోన్‌లో మధు ఆవేదన విన్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మధుని ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







