కొరటాల శివ త్వరలో బాలీవుడ్ ఎంట్రీ
- November 19, 2015
మిర్చి, శ్రీమంతుడు సినిమాల సక్సెస్ తో మంచి ఫాంలో ఉన్న దర్శకుడు కొరటాల శివ. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా ఉన్న శివ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడట. ఇప్పటికే ఇందుకు సంబందించిన ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. తెలుగులో మహేష్ బాబు హీరోగా ఘనవిజయం సాధించిన శ్రీమంతుడు సినిమాను బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు కొరటాల శివ. శ్రీమంతుడు సినిమా బాలీవుడ్ రీమేక్ రైట్స్ ను ఈరోస్ ఇంటర్ నేషనల్ సంస్థతో కలిసి తానే స్వయంగా తీసుకున్నాడు శివ. ఇప్పటికే ఈ సినిమాను చూసిన హృతిక్, బాలీవుడ రీమేక్ లో నటించడానికి తన అంగీకారాన్ని తెలిపాడు. క్లైమాక్స్ పార్ట్ లో కొన్ని మార్పులు సూచించిన బాలీవుడ్ స్టార్, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నాడట. తెలుగు వర్షన్ లో జగపతిబాబు కనిపించిన పాత్రలో బాలీవుడ్ లో హృతిక్ రియల్ ఫాదర్ రాకేష్ రోషన్ ను నటింప చేయాలని ప్రయత్నిస్తున్నారు. హృతిక్ ప్రస్తుతం మొహంజోదారో అనే పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తుండగా, కొరటాల శివ ఎన్టీఆర్ తో తెరకెక్కిస్తున్న జనతాగ్యారేజ్ (వర్కింగ్ టైటిల్) సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఆగస్టులో పూర్తి అయ్యే అవకాశం ఉంది కనుక ఆ తరువాత బాలీవుడ్ శ్రీమంతుడు సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే సంఛలనం సృష్టించిన కొరటాల శివ బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







