కోవా కోన్స్
- December 31, 2017కావలసినవి: మైదా - 250 గ్రా, నెయ్యి - 100 గ్రా, పంచదార పొడి - 100 గ్రా, పాలు - 100గ్రా, నూనె - వేపుడుకు సరిపడా.
కోవా ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా - 250 గ్రా, పంచదార - 50 గ్రా, డ్రై ఫ్రూట్స్ తరుగు - 1 కప్పు (జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష).
తయారీ: మైదా, నెయ్యి, పంచదార పొడి, పాలు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని రోటీలా వత్తుకోవాలి. ఈ రోటీని సన్నని పట్టీలుగా కట్ చేసుకోవాలి. ఈ మైదా పట్టీలను మెటల్ కోన్ పైనుంచి కిందవరకూ చుట్టి అంచుల్ని పాలు తడిపి అతికించాలి. ఈ కోన్లను నూనెలో వేయించుకుని చల్లారాక వేరు చేయాలి. మరో బాండీలో కోవా వేసి చిన్న మంట మీద 10 ని.లు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరో గిన్నెలో వేయించిన ఖోయా, డ్రై ఫ్రూట్స్, పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న కోన్స్‌లో నింపి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయాలి.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత