కోవా కోన్స్‌

- December 31, 2017 , by Maagulf
కోవా కోన్స్‌

కావలసినవి: మైదా - 250 గ్రా, నెయ్యి - 100 గ్రా, పంచదార పొడి - 100 గ్రా, పాలు - 100గ్రా, నూనె - వేపుడుకు సరిపడా.
 
కోవా ఫిల్లింగ్‌ కోసం: పచ్చి కోవా - 250 గ్రా, పంచదార - 50 గ్రా, డ్రై ఫ్రూట్స్‌ తరుగు - 1 కప్పు (జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష).
 
తయారీ: మైదా, నెయ్యి, పంచదార పొడి, పాలు కలిపి మెత్తని ముద్దగా చేసుకోవాలి. కొద్దిగా పిండి తీసుకుని రోటీలా వత్తుకోవాలి. ఈ రోటీని సన్నని పట్టీలుగా కట్‌ చేసుకోవాలి. ఈ మైదా పట్టీలను మెటల్‌ కోన్‌ పైనుంచి కిందవరకూ చుట్టి అంచుల్ని పాలు తడిపి అతికించాలి. ఈ కోన్‌లను నూనెలో వేయించుకుని చల్లారాక వేరు చేయాలి. మరో బాండీలో కోవా వేసి చిన్న మంట మీద 10 ని.లు వేయించి పూర్తిగా చల్లారనివ్వాలి. మరో గిన్నెలో వేయించిన ఖోయా, డ్రై ఫ్రూట్స్‌, పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేయించి పెట్టుకున్న కోన్స్‌లో నింపి డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్‌ చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com