మానసిక రోగి పోలీసుపై కత్తితో దాడి .. పోలీస్ మృతి
- January 01, 2018
మస్కట్ : ఒమన్ రాజధాని మస్కట్ లో అత్యంత అరుదైన ఒక దాడిలో పోలీస్ శనివారం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసును కత్తితో పొడిచి ఆ దుండగుడు హతమార్చాడు. ఆ హంతకుడు "మానసికంగా అనారోగ్యం" గా ఉన్నట్లు అభివర్ణించారు .పోలీసుపై దాడిచేసిన వ్యక్తి మస్కట్ షాపింగ్ సెంటర్ వద్ద ఉన్న పోలీసును కత్తితో పొడిచి గాయపరిచాడు. ఆ నిందితుడు మానసికంగా అనారోగ్యంతో ఉన్నాడని సూచించే ఒక పత్రం తమ స్వాధీనంలో ఉందని పోలీసులు తెలిపారు. స్థానిక టీవీ ఛానెల్ తో ఒక పోలీస్ అధికారి మాట్లాడుతూ " నిందితుని అనుమానాస్పద ప్రవర్తన గురించి పిర్యదు తీసుకొన్న పోలీసులు షాపింగ్ సెంటర్ వద్దకు వెళ్లారు. అక్కడ అనుమానితుడు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వద్ద ఒక వ్యక్తితో తగాదా పడుతున్నాడు దీనితో అడ్డుకోబోయిన పోలీసును .అనుమానితుడు ఒక కత్తిని వెలుపలకు లాగి ఆ పోలీస్ అధికారిని బలంగా పొడిచాడు. ప్రాణాంతక గాయంతో ఆ పోలీస్ అధికారి విలవిలాడుతుండగా . మరో ఇద్దరు అధికారులను సైతం కత్తితో పొడిచాడని తెలిపారు. ఎట్టకేలకు ఆ దాడిని అడ్డుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఒమన్ లో నేరాల సంఖ్య అతి తక్కువగా నమోదుకావడంతో ఈ కత్తిపోట్ల వ్యవహారం స్థానికంగా సంచలనం కల్గించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







