కొత్త వీడియో విడుదల చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్
- January 01, 2018
రాజకీయాల్లోకి వస్తున్నట్టు నిన్న ప్రకటించిన రజనీకాంత్.. ఇవాళ మరో అడుగు ముందుకు వేశారు. తనతో కలిసి నడిచేవాళ్లందరినీ ఏకం చేసేందుకు ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. అభిమానులు, మద్దతుదారులు, ప్రజలు "రజనీమంత్రం.ORG"లో చేరాలని పిలుపిచ్చారు. ఈ వెబ్‌సైట్‌తోపాటు గూగుల్ ప్లే స్టోర్‌లో ఓ ఆండ్రాయిడ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. తన పొలిటికల్ ఎంట్రీకి మద్దతిచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పార్టీ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కీలక ప్రకటనలు చేస్తారని కూడా తెలుస్తోంది. ఆయన పెట్టబోయే పార్టీ పేరు ఏంటన్న దానిపై కూడా రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. సంక్రాంతికి పార్టీ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. అభిమానులే తనకు అండ అని చెప్తున్న రజనీ.. అమీతుమీ తేల్చుకునేందుకే తాను పాలిటిక్స్‌లోకి వచ్చానంటున్నారు. నిన్న పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇస్తూనే రజినీ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుత రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలని ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు రజనీ వెబ్‌సైట్ లాంఛ్‌తో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. లక్షలాదిమంది మెంబర్లుగా చేరి మేముసైతే అంటూ రజనీకి మద్దతు పలుకుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







