వైట్ హౌస్ ను పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరింపు
- November 19, 2015
అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్ హౌస్ ను పేల్చివేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బెదిరించారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరిస్తూ ఉగ్రవాదులు మరో వీడియోను 'పారిస్ బిఫోర్ రోమ్' పేరుతో విడుదల చేశారు. 6 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇరాక్ లో రూపొందించారు. పారిస్ లో మరిన్ని దాడులు చేయడంతో పాటు వైట్ హౌస్ ను బాంబులతో పేల్చివేస్తామని వీడియోలో ఓ ఉగ్రవాది బెదిరించాడు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండెను చంపేస్తామని వీడియోలో మరో ఉగ్రవాది హెచ్చరించాడు. 'ఆత్మాహుతి బాంబు దాడులు, కారు బాంబులతో మిమ్నల్ని చంపేస్తాం. మీరెక్కడికి వెళ్లినా వదలిపెట్టం' అని ఆ ఉగ్రవాది అన్నాడు. న్యూయార్క్ లో దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వీడియో విడుదల చేసిన మరుసటి రోజు తాజా వీడియో విడుదల చేశారు. అయితే అమెరికాలో పారిస్ తరహా దాడుల ముప్పు లేదని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ చెప్పారు.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







