భారతీయ ఆర్మీలోకి ప్రైవేట్ సంస్థలు
- January 02, 2018
రక్షణ శాఖలోకి ప్రైవేటు కంపెనీల అడుగుపడబోతోంది. భారతీయ ఆర్మీకి చెందిన ఆర్మీ బేస్ వర్క్షాపు(ఏబీడబ్ల్యూ)లను నిర్వహించేందుకు చేసేందుకు ప్రైవేటు కంపెనీలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గల ఎనిమిది నగరాల్లోని ఏబీడబ్ల్యూలను ప్రవేటు కంపెనీలు నడపనున్నాయి.
‘ప్రభుత్వ ఆస్తిని కాంట్రాక్టర్ నిర్వహించే మోడల్’ కింద రక్షణ శాఖ దీన్ని ఆమోదించింది. ఈ మోడల్లో ప్రైవేటు కంపెనీలు రక్షణ శాఖలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవు. కానీ, కంపెనీలకు కావలసిన భూమి, వస్తువులు, మెషీన్లు తదితర వనరులను ప్రభుత్వమే సమకూర్చుతుంది.
నిపుణుల కమిటీ(సీఓఈ) సూచనలతోనే రక్షణ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిసింది. ఆర్మీ సామర్ధ్యాన్ని పెంచడం, రక్షణ శాఖ వ్యయాన్ని అదుపులో ఉంచడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని సీఓఈ ఈ సూచనలు చేసినట్లు సమాచారం. ఎల్లప్పుడూ యుద్ధం కోసం ఆయుధాలను సిద్ధంగా ఉంచేందుకు ఏబీడబ్ల్యూలను రెండో ప్రపంచయుద్ధం సమయంలో ఆరంభించారు.
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఓ వైపు ఆయుధాలను పర్యవేక్షించేందుకు ఉన్నా.. భారతీయ ఆర్మీ ఎన్నడూ దానిపై ఆధారపడలేదు. ఢిల్లీ, కోల్కతా, పుణె, బెంగుళూరు తదితర కీలక నగరాల్లో ఏబీడబ్ల్యూలు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







