4 ఎన్.ఎస్.ఎస్ అవార్డులు దక్కించుకున్న తెలంగాణ రాష్ట్రం
- January 02, 2018
హైదరాబాద్:జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) విభాగంలో కేంద్రం అందించిన అత్యున్నత అవార్డులు అందుకున్న తెలంగాణ వాలంటీర్లను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం అభినందించారు. 2016-17 సంవత్సరానికి కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అందించిన ఎన్.ఎస్.ఎస్. అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రం నాలుగు దక్కించుకుంది. ఉత్తమ యూనిట్ అవార్డు మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ కు చెందిన అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూట్ కు, ఉత్తమ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డు అనురాగ్ గ్రూప్ ప్రోగ్రాం ఆఫీసర్ సి.మల్లేశ్, ఉత్తమ వాలంటీర్లుగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీకి చెందిన తగరపు నవీన్, జె.ఎన్.టి.యు(హెచ్)కు చెందిన పటుకూరి లలిత్ ఆదిత్య గత నెలలో అందుకున్నారు. వీరిని సిఎం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్. రాష్ట్ర మాజీ లైజనింగ్ ఆఫీసర్ డాక్టర్ ఎంఎస్ఎన్ రెడ్డి, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







