మళ్లీ పెరిగిన బంగారం ధర..!
- January 02, 2018
అమెరికా- ఉత్తర కొరియా ఉద్రిక్త పరిస్థితులతోపాటు, అమెరికా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో డాలర్ బలహీనత అంచనాలు ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెంచాయి. అంతర్జాతీయ మార్కెట్లో 2017లో దాదాపు 150 డాలర్లు ఎగసింది.
ఒకదశలో 200 డాలర్ల పెరుగుదలనూ నమోదుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, దేశీయ నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు అధికంగా ఉండడంతో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ మధ్య కొన్ని రోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈ రోజు బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.50 పెరిగి 30, 450గా నమోదైంది. సింగపూర్ మార్కెట్లో ఔన్స్ బంగారం 0.42 శాతం పెరిగి 1,308 డాలర్లుగా నమోదైంది. కాగా, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడంతో కిలో వెండి ధర రూ.390 తగ్గి 39,710గా నమోదైంది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







