నేడు కతార్‌లో తీవ్రమైన గాలులు, దుమ్ము తో కూడిన వాతావరణం
- November 20, 2015
నేడు కతార్‌లో తీవ్రమైన గాలులు, దుమ్ము తో కూడిన వాతావరణం మరియు అతి తక్కువ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలలో తీవ్రమైన గాలులు, ఉధృతమైన అలలు రేగుతాయని; దేశంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 18 మరియు 28 డిగ్రీల సెంటిగ్రేడుగా, అదేవిధంగా దోహాలో 21 మరియు 28 డిగ్రీల సెంటిగ్రేడుగా ఉంటాయని వారు తెలిపారు. గాలివేగం మధ్యాహ్నానికి 22 నాట్లు, తీరప్రాంతాలలో 18 నుండి 25 నాట్లు ఉంటుందని, అది 28 నాట్ల వరకు కూడా చేరవచ్చని; వాతావరణం మేఘావృతమై, కొన్నిచోట్ల చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని, పగటి పూట దృష్టి గోచరత 3 కిలోమీటర్లు ఉంటుందని వారు అంచనా వేసారు
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







