జనవరి 5న 'నీతో ఏదో చెప్పాలని ఉంది' సాంగ్
- January 04, 2018
మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి.పట్నాయక్...తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయ అక్కర్లేని పేరు. చిత్రం, జయం, నువ్వు-నేను, 'సంతోషం', 'మనసంతా', 'నువ్వు లేక నేను లేను' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతం అందించిన ఆర్.పి.పట్నాయక్. దర్శక నిర్మాతగా మారిన తర్వాత తన సంగీతంతో మ్యూజిక్ ప్రేమికులను అలరించడం తగ్గిపోయింది. అయితే సంగీత ప్రేమికుల కోసం ఆర్.పి ఇప్పుడు 'నీతో ఏదో చెప్పాలని ఉంది' అనే మెలోడీ సాంగ్‌ను సిద్ధం చేశారు. ఈ సాంగ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలవుతుంది. సంగీతం అందించడమే కాకుండా ట్యూన్‌కు తగ్గ సాహిత్యం కూడా ఆర్.పియే అందించడం విశేషం. ఈ సాంగ్‌ను ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. 'బాహుబలి' సినిమాలో 'మమతల తల్లి..' పాటను పాడిన సత్య యామిని పాడగా, సత్య యామిని, అనుదీప్ కలిసి నటించారు. జనవరి 5న ఈ పాటను విడుదల చేస్తున్నారు.
ఈ సాంగ్ సంగీతం ప్రపచంలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఆదిత్య మ్యూజిక్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అలాగే మంచి కాన్సెప్ట్స్‌తో కూడిన ఓరిజినల్ సాంగ్స్‌ను, మ్యూజిక్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయడానికి ఆదిత్యమ్యూజిక్ ఎప్పుడూ ముందుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







