తమిళ సంప్రాదాయ పద్దతిలో పెళ్లి చేసుకున్న జపనీస్ జంట
- January 04, 2018
పెళ్లంటే సూటూబూట్లూ కొనేస్తారు.. డెస్టినేషన్ మేరేజులతో ఇంటర్నేషనల్ లెవల్లో మారేజ్ చేసుకోవాలని కలలు కంటారు. కానీ ఇండియన్ ట్రెడిషన్ అంట్ ఇష్టపడ్డ ఒక జపనీస్ జంట.. పూర్తిగా హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా తమిళ సంప్రదాయంపై మక్కువ పెంచుకుని, దానికి పుట్టిల్లైన మదురైలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై మక్కువ పెంచుకున్న ఒక జపనీస్ జంట చిహారూ ఒబాటా, యూటో నింగా జంట మదురైలో పూర్తిగా తమిళ సంప్రదాయంలో పెళ్లాడింది. గత ఏడాది ఏప్రిల్‌లో జపాన్‌లో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న ఈ జంట.. అక్కడే ఉంటున్నతమిళ దంపతుల సాయంతో తమ కలను నిజం చేసుకుంది. మదురైలో తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలనుకున్న జపాన్ జంటకు వధువు స్నేహితురాలు సాయం చేసింది. పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి.. ఒబాటా, యూటోల పెళ్లిని ఘనంగా జరిపించింది.
వధువు ఒబాటా పట్టుచీరలో మెరిసిపోతే, తెల్ల పంచె చొక్కాలో రెడీ అయ్యాడు వరుడు యూటో. పెళ్లి పత్రిక కూడా తమిళంలో మదురై సంప్రదాయం ప్రకారం ప్రింట్ చేయించారు. పూలదండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడమే కాదు.. ఒబాటా మెడలో యూటో పుస్తె కూడా కట్టాడు. ఈ జపాన్ జంట తమిళ వివాహానికి వధూ వరుల బంధువులు కూడా హాజరయ్యారు. రావడం కాదు.. సంప్రదాయం ప్రకారం పంచె, చొక్కా-చీరలు కట్టుకుని సంస్కృతిని గౌరవించారు.
తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న వధువు ఒబాటా దాని కోసం తను ఎన్ని కలలు కన్నానో తమిళంలో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. జపాన్‌లో కాలేజ్ లింగ్విస్టిక్ కోర్స్‌లో భాగంగా తమిళ్ ఎంచుకుంది జపాన్ యువతి. రీసెర్చ్ కోసం మదురై వచ్చింది. అంతే ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలతో ప్రేమలో పడిపోయింది. భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకోవాలని కలలుకగన్న ఒబాటా తమిళ సంస్కృతికి పుట్టిల్లైన మదురైలో, అక్కడి సంప్రదాయం ప్రకారమే పెళ్లి చేసుకోవాలనుకుంది. చివరకు దాన్ని నెరవేర్చుకుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!