మసాల కుల్చా
- January 04, 2018
కావలసిన పదార్థాలు: మైదా - 250 గ్రా., ఈస్ట్ - ఒక టీ స్పూను, పాలు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2, పెద్ద ఉల్లిపాయలు - 2, కారం - ఒక టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - 2 టేబుల్ స్పూన్లు, బటర్ - ఒక టేబుల్ స్పూను, ఉల్లిగింజలు (కలొంజి) - ఒక టీ స్పూను, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు.
తయారుచేసే విధానం: గోరువెచ్చని పాలల్లో (ఒక వంతు పాలు + మూడు వంతులు నీరు) ఈస్ట్, అర టీ స్పూను పంచదార వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మైదాలో వేస్తూ ముద్దగా చేసుకుని 30 నిమిషాలు పక్కనుంచాలి. ఉల్లి తరుగులో ఉప్పు, కారం వేసి కొద్దిసేపు తర్వాత పిండి నీరు తీసెయ్యాలి. మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒత్తి మధ్యలో ఉల్లి మిశ్రమం పెట్టి మడిచి 10 నిమిషాలు పక్కనుంచాలి. ఇప్పుడు ఓవెన్‌ను 250 డిగ్రీల దగ్గర పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. నూనె రాసిన బేకింగ్ ట్రేలో ఉండలు ఉంచి, చేత్తో కుల్చాలుగా (కచోరిలా) ఒత్తి పైన ఉల్లిగింజలు, కొత్తిమీర చల్లాలి. తర్వాత 160 డిగ్రీల దగ్గర 8-10 నిమషాల పాటు ఓవెన్‌లో బేక్ చేసుకోవాలి. కుల్చాలకు మసాల శనగల కూర మంచి కాంబినేషన్.
తాజా వార్తలు
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!
- ఖతార్ లో 2025 చివరి సూపర్మూన్..!!







