మూడునెలలు ఇలా చేస్తే మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకోవచ్చు..!!
- January 04, 2018
ఊబకాయంతో బాధపడుతున్నవారు, లావు తగ్గాలని కోరుకుంటున్నవారు రాత్రి సమయాల్లో అన్నం మానేయడం చాలా మంచి పద్థతి. రాత్రి సమయాల్లో మనం చేసే పని ఏమీ ఉండదు. పైగా విశ్రాంతి కోసం నిద్రపోతాం. నిద్రించే సమయంలో మన శక్తి ఏ మాత్రం ఖర్చు కాదు. దాంతో నైట్ తిన్న ఫుడ్ ద్వారా వచ్చిన కాలరీలో పొట్టలో అలాగే డిపాజిట్ అవుతాయి. అందుకే రాత్రి సమయంలో అన్నం తినడం వల్ల అది ఖర్చు కాకపోవడంతో క్రొవ్వు మిగిలిపోయి లావయ్యే ప్రమాదం ఉంది.
రాత్రి సమయాల్లో భోజనం చేసి వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి హానికరం. రాత్రి సమయంలో భోజనానికి బదులుగా చపాతిని తింటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్లేటు నిండుగా భోజనం చేసినా, రెండు లేదా మూడు చపాతీలు తిన్నా ఒకటేనని డాక్టర్లు అంటున్నారు. అన్నం కంటే చపాతి శరీరానికి అధిక శక్తి ఇస్తుందని నిరూపితమైంది. శక్తిని ఇస్తుంది కానీ చపాతీల్లో క్రొవ్వు పదార్థాలు మాత్రం ఉండవు.
గోధుమ పిండిలో విటమిన్ - బి, ఈ, కాపర్ అయోడిన్, జింక్, మాంగనీస్ వంటి ఎన్నో ఖనిజాలు ఉంటాయి. గోధుమల్లో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. చపాతీలు చాలా బాగా జీర్ణమవుతాయి. జీర్ణవ్యవస్థపై ఎలాంటి ఒత్తిడిపై పడవు. చపాతీని కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా తీసుకోవాలి. ఇలా మూడునెలల పాటు చేస్తే మీ శరీరంలో మార్పులు కనిపించి మీకు మీరే కొత్త కనిపిస్తారంటున్నారు వైద్య నిపుణులు.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







