డ్రగ్ అబ్యూస్ కేసులు: 2017లో 1,000 మంది అరెస్ట్
- January 05, 2018
మనామా: డ్రగ్ అబ్యూజ్ రిలేటెడ్ అరెస్టులకు సంబంధించి 2017 తొలి పది నెలల్లో దాదాపు 1,000 అరెస్టులు జరిగాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ పేర్కొన్న వివరాల ప్రకారం మొత్తం 1,050 అరెస్టులు జరిగాయని, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఈ అరెస్టులు జరిగాయని, 2016లో ఇదే సమయానికి ఈ సంఖ్య 1,153గా ఉందని పేర్కొంది. అరెస్టయినవారిలో 38 మంది మహిళలున్నారు. వీరిలో 538 మంది జిసిసి జాతీయులు. 279 మందిస్థానికులు. 58 అరబ్ జాతీయులు కాగా, 175 మంది విదేశీయులు. తొమ్మిది ఓవర్ డోస్ మరణాలు 2017లో నమోదు కాగా, 2016లో వీటి సంఖ్య 11. యాంటీ నార్కోటిక్స్ పోలీస్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్ -ఇంటీరియర్ మినిస్ట్రీ ద్వారా అరెస్టులు జరిగాయి. కింగ్‌డమ్‌లోని పలు ప్రాంతాలు, ఎంట్రీ పాయింట్స్, బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, కింగ్ ఫవాద్ కాజ్‌వే, మినా సల్మాన్ అండ్ ఖలీఫా బిన్ సల్మాన్ సీ పోర్ట్స్‌లలో ఈ అరెస్టులు జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







