డ్రగ్ స్మగ్లింగ్ యత్నం భగ్నం
- January 05, 2018
మనామా: బహ్రెయిన్‌కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్, మేజర్ డ్రగ్ స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేసింది. యూఏఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అందించిన సమాచారంతో డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో పలువురు నిందితుల్ని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేయడంతోపాటుగా, వారి నుంచి కిలో గ్రామ్ బరువు గల డ్రగ్స్‌ని సీజ్ చేశారు. 44 క్యాప్సూల్స్‌లో 363 గ్రాముల నార్కోటిక్ సబ్‌స్టాన్స్ (హెరాయిన్ కావొచ్చు) స్వాధీనమయ్యింది. దీని విలువ 36,300 బహ్రెయినీ దినార్స్‌గా ఉంటుందని సమాచారమ్. బహ్రెయిన్‌కి చెందిన యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్‌మెంట్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, క్రిమినల్ ఎవిడెన్స్, యూఏఈ కౌంటర్ పార్ట్స్‌తో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. అండర్ కవర్ పోలీస్‌మేన్, డ్రగ్ డీలర్‌లా నటించి ఈ మొత్తం రాకెట్‌ని ఛేదించగలిగారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







