ఓడలలో ఎంచక్కా ...ఇకపై మక్కా !!
- January 08, 2018
సౌదీఅరేబియా: డబ్బు లేకపోతే దైవ దర్శనం సాధ్యపడదా ? ఖరీదైన విమానాలలో బోలెడు ఖర్చు చేయాల్సిందేనా ?? ఇందుకు ఒక పరిష్కారం లభ్యమైంది. హజ్ యాత్రికులు ఇకపై నానా యాతనలు పడనక్కరలేదు. సముద్ర మార్గంలో ఓడలపై సైతం మక్కా చేరుకోవచ్చని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ప్రకటించారు. ఈ మేరకు మక్కాలో సౌదీ ప్రభుత్వాధికారులతో చర్చలు జరిపామని నక్వీ తెలిపారు. చర్చలు సఫలమయ్యాయని, ఇరు దేశాల మధ్య ఒప్పందం కూడా కుదిరిందని ఆయన అన్నారు. సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్ర చేయాలంటే కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేసుకునేందుకు ఇరు దేశాల అధికారులు సమీక్ష నిర్వహించారని ఆయన తెలిపారు. సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్ర పేద ముస్లింలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తక్కువ ఖర్చుతో హజ్ యాత్ర పూర్తి చేయించేందుకే సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపామని ఆయన అన్నారు. గతంలోనూ ముంబై నుంచి జెడ్డా వరకు సముద్ర మార్గంలో హజ్ యాత్రికులు మక్కా వెళ్లేవారని నక్వీ తెలిపారు. 1995 నుంచి సముద్ర మార్గంలో హజ్ యాత్రికులను సౌదీ ప్రభుత్వం అనుమతించలేదని ఆయన అన్నారు. అయితే సముద్ర మార్గంలో హజ్ యాత్ర చేసేందుకు మరికొంతకాలం పడుతుందని అధికారలు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







