ఒక వారంలో 28,306 ట్రాఫిక్ ఉల్లంఘనలు ..టిక్కెట్ల జారే

- January 08, 2018 , by Maagulf
ఒక వారంలో  28,306 ట్రాఫిక్ ఉల్లంఘనలు ..టిక్కెట్ల జారే

కువైట్: కొత్త ఏడాదికి స్వాగతం పలికే వేళ కొందరు తమ తమ వాహనాలను ..ద్విచక్రవాహనాలను జోరుగా నడుపుతూ అత్యుత్సాహం చూపుతారు. మన దేశాలలో చాలావరకు పోలీసులు చూసీచూడనట్లు వదిలేస్తారు..కానీ గల్ఫ్ దేశాలలో ఎటువంటి మొహమాటం లేకుండా కేసులు రాసిపారేస్తారు.   డిసెంబర్ 31 వ తేదీ 2017 నుండి జనవరి 6, 2018 వరకు అంతర్గత వ్యవహారాల శాఖ వద్ద ట్రాఫిక్ విభాగం అనేక ప్రచారాలను చేపట్టింది, ఫలితంగా 28,306 ట్రాఫిక్ ఉల్లంఘనలు, నమోదు కాబడ్డాయి. 733 వాహనాలు మరియు 17 మోటార్ సైకిళ్లను ఈ సందర్భంగా స్వాధీనం చేసుకొని టికెట్లను వాహనదారులకు   జారీ చేశారు. అదే విధంగా 17 మందిని అరెస్టు చేశారు. మరియు ఒక ప్రవాసియ  మహిళ తన వాహనానినికి లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడంతో ఆమెను దేశం నుండి బహిష్కరించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com