ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాలో పెద్ది రాహుల్
- January 08, 2018
హైదరాబాద్: మన రాష్ర్టానికి చెందినపెద్ది రాహుల్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా సంపాదించాడు.ఇటలీలోని వెనిస్లో ముగిసిన ఇన్విటేషనల్ చెస్ చాంపియన్ సందర్భంగా మూడో ఇంటర్నేషనల్ నార్మ్ సాధించడంతో మనదేశం నుంచి ఇంటర్నేషనల్ మాస్టర్ హోదా అందుకున్నాడు. హైదరాద్ నగరంలోని కొంపల్లికి చెందిన రాహుల్ ఇంటర్నేషనల్ మాస్టర్ హోదాసాధించడంతో అతని తల్లితండ్రులు హర్షం వ్యక్తం చేసారు. ఫిడేకు అధికార ప్రతినిథి కుకూస్ స్టోక్ నుంచి రాహుల్ ఐఎం హోదా అందుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన నారాయణ రామరాజు కోచ్‌గా రాహుల్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. 2400 ఎలో రేటింగ్ పాయింట్లు సాధించి గ్రాండ్‌మాస్టర్ హోదా దిశగా కదులుతున్నాడు. సాధు వైష్ణవి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న రాహుల్ 15 ఏండ్ల 9 రోజుల వయసులోనే ఐఎం నార్మ్ సాధనతో తెలంగాణ రాష్ట్రం నుంచి ఐఎం నార్మ్ సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా, దేశంలో ఈ ఘనత సాధించిన మూడో యువ చెస్ ఆటగాడిగా రికార్డులు నెలకొల్పాడు. 2017 ఆగస్టులో లాత్విలో జరిగిన టోర్నీలో తొలి ఐఎం నార్మ్ సాధించగా.. డిసెంబర్ 2017లో నెదర్లాండ్స్‌లో జరిగిన టోర్నీలో రెండోనార్మ్ సంపాదించాడు. గతేడాది ముగిసిన ప్రపంచ యువ చెస్ ఒలింపియాడ్‌లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆసియా అండర్-10 చెస్ టోర్నీలో కాంస్యం అందుకున్నాడు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







