దక్షిణ చైనా సముద్రంలో నౌకా ప్రమాదం

- January 08, 2018 , by Maagulf
దక్షిణ చైనా సముద్రంలో నౌకా ప్రమాదం

హాంగ్ కాంగ్: దక్షిణ చైనా సముద్రంలో ఓ ఇంధన ట్యాంకర్, మరో రవాణా నౌక ఢీకొన్న ఘటనలో 32 మంది నౌకా సిబ్బంది గల్లంతయ్యారు. పనామాకు చెందిన సాంచి నౌకలో వారంతా ఉన్నట్లు సమాచారం. అందులో ఇరాన్‌కు చెందిన 30 మంది, బంగ్లాదేశ్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ సిబ్బంది ఆచూకీ చిక్కడం లేదని చైనా రవాణా శాఖ పేర్కొన్నది. యాంగ్జీ నదికి 180 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్ సాంచి నుంచి ఇంకా మంటలు వస్తున్నాయి. దాని నుంచి భారీ స్థాయిలో దట్టమైన నల్లటి పొగ కూడా వస్తున్నది. సీఎఫ్ క్రిస్టల్ రవాణా నౌకలో ఉన్న 21 మంది చైనా సిబ్బంది మాత్రం ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. సాంచీ నౌకలో సుమారు లక్షన్నర టన్నులు ఆయిల్ ఉన్నది. ఇరాన్ నుంచి సౌత్‌కొరియాకు ఆ ఇంధనాన్ని తీసుకెళ్లుతున్నారు. సీఎఫ్ క్రిస్టల్ నౌకలో అమెరికా నుంచి చైనాకు ఆహారపదార్ధాలను రవాణా చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com