చిన్నారిపై అత్యాచారం, హత్య: జస్ట్ ఫేక్ న్యూస్
- January 09, 2018
మస్కట్: ఒమన్‌లో ఓ చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారనీ, అనంతరం ఆమెని హత్య చేశారనీ, మరో ఇద్దరు చిన్నారులూ కిడ్నాప్ అయ్యారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఓ వాయిస్ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. వైరల్‌గా మారిన ఈ ఉదంతంపై రాయల్ ఒమన్ పోలీసులు స్పందించారు. ఇదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని తేల్చారు. సోహార్‌లో ఓ బాలిక కిడ్నాప్‌కి గురయ్యిందనీ, అనంతరం ఆమెను చంపేశారనే వాయిస్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం తమ దృష్టికి కూడా వచ్చిందనీ, అది ఫేక్ న్యూస్ అని నిర్ధారణ అయ్యిందని పోలీసులు వెల్లడించారు. ఇలాంటి ఫేక్ న్యూస్‌ని వైరల్‌గా మార్చుతున్నవారిపై కఠిన చర్యలుంటాయని పోలీసులు వివరించారు. సోషల్ మీడియా ద్వారా వివరాల్ని సేకరించి, దుష్ప్రచారం చేపట్టినవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







