సిగరెట్లు అమ్మలేదని భారత సంతతి వ్యక్తిని చంపేశారు
- January 10, 2018
లండన్: సిగరెట్లు విక్రయించలేదనే ఆగ్రహంతో మైనర్లు భారత సంతతి దుకాణుదారు హత్య చేశారు. ఈ సంఘటన ఉత్తర లండన్‌లో జరిగింది. మిల్ హిల్ ఏరియాలో విజయ్ పటేల్ అనే 49 ఏళ్ల వ్యక్తి శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు.
యుకె టీనేజర్ల దాడిలో గాయపడిన విజయ్ పటేల్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను సోమవారంనాడు మరణించాడు. దాడిలో పాల్గొన్నవారిని పట్టుకోవాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు పటేల్ ఆస్పత్రిలో పడకపై ఉన్న మృతదేహం, లైఫ్ సపోర్ట్ మిషన్‌కు తగిలించి ఉన్న వైనం ఫొటోలను విడుదల చేశారు.
విజయ్ పటేల్‌కు ఇద్దరు కుమారులు ఉన్నారు. పటేల్ హత్య కేసులో 16 ఏళ్ల బాలుడు కోర్టుకు హాజరయ్యాడు. ముగ్గురు వ్యక్తులు పటేల్‌పై దాడి చేశారని, సమాచారం సేకరిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
పటేల్ ఛాతీపై వారు పిడిగుద్దులు గుద్దినట్లు తెలుస్తోంది. దానివల్ల అతను వెనక్కి పడిపయాడు. పటేల్ 2006లో తన భార్య విభతో కలిసి లండన్ వచ్చాడు. ఈ దాడి జరిగిన సమయంలో భార్య భారత్‌లో ఉన్నరు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







