ఒమన్‌లో వలసదారులకు హ్యూమన్ రైట్స్ ఆపన్నహస్తం
- January 10, 2018
కొందరు యజమానుల కారణంగా వలసదారులు ఒమన్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యల్ని విన్నవించేందుకు ఒక్కోసారి వారికి సరైన మార్గమే కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒమన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి ఆపన్న హస్తం అందిస్తోంది. తమ హక్కుల గురించి కార్మికుల్లో మరింత అవగాహన పెంచేందుకోసం ఓ హ్యాండ్ బుక్‌ని ఇంగ్లీషు మరియు అరబిక్లోకి అందుబాటులోకి తీసుకొస్తోంది. పెద్దయెత్తున తమకు అందుతున్న ఫిర్యాదు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామనీ, ఈ హ్యాండ్ బుక్ ద్వారా సోకాల్డ్ యజమానుల నుంచి కార్మికులకు రక్షణ లభిస్తుందని హ్యూమన్ రైట్స్ పేర్కొంటోంది. జీతాలు, తగిన వసతి ఇతర హక్కుల విషయంలో ఎక్కువగా వలసదారులు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. వీరిలోనూ డొమెస్టిక్ వర్కర్స్ సమస్యలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. హ్యాండ్ బుక్‌లో హక్కుల గురించి పేర్కొనడమే కాకుండా, హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు చేయాల్సిన ఫిర్యాదుల గురించీ సవివరంగా పేర్కొంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







