జిసిసి పాస్‌పోర్ట్ ర్యాంకింగ్స్: బహ్రెయిన్‌కి 4వ స్థానం
- January 10, 2018
మనామా: హెన్లీ గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌లో జిసిసి దేశాల కేటగిరీలో బహ్రెయిన్ నాలుగో స్థానం సాదించుకుంది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్ 63వ స్థానం దక్కించుకుంది. వీసా ఫ్రీ కేటగిరీలో ఓ దేశానికి చెందిన పౌరులు ఎన్ని దేశాల్ని సందర్శించారనే కోణంలో ఈ సర్వే జరుగుతుంది. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో బహ్రెయిన్‌తోపాటు నాంబియా కూడా 63వ ర్యాంక్ దక్కించుకుంది. జిసిసి దేశాల్లో యూఏఈ తొలి స్థానంలో నిలిచింది. 133 దేశాలకు వీసా ఫ్రీ ట్రావెల్ సౌకర్యం యూఏఈ కల్పిస్తోంది. కువైట్ 58వ స్థానంలోనూ, ఖతార్ 62వ స్థానంలోనూ, ఒమన్ 65వ స్థానంలోనూ, సౌదీ అరేబియా 67వ స్థానంలోనూ నిలిచాయి. బహ్రెయిన్ పౌరులు 75 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యంతో వెళ్ళేందుకు వీలుంది. గ్లోబల్ లిస్ట్‌లో జర్మనీ తొలి స్థానంలో నిలిచింది. 177 దేశాలకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పిస్తోంది. సింగపూర్ రెండో స్థానంలో, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, నార్వే, స్వీడన్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఆ తర్వాతి స్థానంలో నిలిచాయి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







