షార్జా స్పోర్ట్స్ డిజర్ట్ ఫెస్టివల్‌కి సర్వం సిద్ధం
- January 10, 2018
రెండో ఎడిషన్ షార్జా స్పోర్ట్స్ డిజర్ట్ ఫెస్టివల్ (ఎస్ఎస్డిఎఫ్), శుక్రవారం 12 జనవరి 2018 నుంచి అల్ బడాయెర్ డిజర్ట్‌లో ప్రారంభం కానుంది. 'బికమ్ ఎ డిజర్ట్ హీరో' కాన్సెప్ట్‌తో ఎమిరేట్స్‌లోనే మోస్ట్ పాపులర్ ఆఫ్ రోడ్ రేసింగ్ కాంపిటీషన్‌ని షార్జా స్పోర్ట్స్ టీవీ నిర్వహిస్తోంది. ఒక్కో కేటగిరీ నుంచీ 15 మంది పార్టిసిపెంట్స్ వైట్ నకల్ టైమ్ ఛాలెంజ్ రేస్‌కి ఎంపిక చేయబడ్తారు. మోటార్ క్రాస్ 1, మోటార్ క్రాస్ 2, డిజర్ట్ అల్ టెర్రైన్ వెహికిల్, యుటిలిటీ టాస్క్ వెహికిల్స్ వంటివి ఈ డిజర్ట్ ఫెస్టివల్లో ప్రధాన ఆకర్షణ కానున్నాయి. సౌతాఫ్రికాకి చెందిన ఛాంపియన్ మిఖాయిల్ డోచెర్తీ ఎఎక్స్ 1 క్లాస్‌లో పోటీ పడ్తున్నారు. బ్రిటిష్ మోటోక్రాస్ రైడర్ రయాన్ బ్లెయిర్ ఎంఎక్స్2లో పోటీ పడ్తున్నారు. ఎమిరేటీ మోటో క్రాస్ రైడర్ సుల్తాన్ అల్ బలూషి, ఖలీఫా అల్ రాస్సి కూడా పోటీల్లో పాల్గొంటున్నారు. ప్రారంభ ఫెస్టివల్ ఘనవిజయాన్ని అందుకుందనీ, రెండో సీజన్ ఇంకా ఘనంగా జరుగుతుందని షార్జా స్పోర్ట్స్ టీవీ డైరెక్టర్ రషీద్ అల్ ఒబాద్ చెప్పారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం







